Sakshi News home page

ప్లస్ టేస్ట్.. ప్లస్ ఏరియా..

Published Wed, Apr 29 2015 11:28 PM

ప్లస్ టేస్ట్.. ప్లస్ ఏరియా.. - Sakshi

చార్మినార్.. చారిత్రాత్మకంగా సిటీకి ప్లస్. హలీమ్.. రంజాన్ మాసంలో సిటీకి అందే ప్లస్ రుచి. హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచ ఖ్యాతి చెందిన ఈ ఘుమఘుమలు.. టేస్ట్ ఆఫ్ సిటీకి మెగా ప్లస్‌గా నిలిచింది. ఒక్కసారి ఈ దక్కన్ బిర్యానీ ముద్ద గొంతులోకి దిగితే.. మరో బిర్యానీ రుచి చేసినప్పుడల్లా.. హైదరాబాద్ గుర్తుకు రావాల్సిందే. హైదరాబాదీలకు అనుకున్నదే తడవుగా బిర్యానీ లాగించే అవకాశం ఉంది. మరి ఇతర నగరవాసులుకో..? మన సిటీ బిర్యాని టేస్ట్ చూడాలంటే వారంతా హైదరాబాద్‌కు రానక్కర్లేదు.

మన సిటీ రెస్టారెంట్స్ బిర్యానీని వేడివేడిగా ఇతర రాష్ట్రాలకూ వడ్డించేస్తున్నాయి. మన సిటీలోని రెస్టారెంట్స్‌లో రాజస్థానీ ఫుడ్‌ఫెస్టివల్, పంజాబీ రుచులు, గుజరాతీ టేస్ట్‌లంటూ రోజూ ఏదో ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ.. హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్స్ ఘనంగానే జరుగుతుంటాయి. చేయి తిరిగిన నలభీములు వండి వార్చినా.. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ తీసుకురాలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ ‘బిర్యానీ బై ఎయిర్’ కాన్సెప్ట్ మొదలైంది. బెంగళూరు, ముంబై, పూణె.. నగరమేదైనా సరే హైదరాబాద్ దమ్ కీ బిర్యానీ రుచి చూడాలనుకుంటే ఇప్పుడు గంటల్లో పని.

కాల్ చేసి ఆర్డర్ చేస్తే సరి సాయంత్రానికి వాళ్లింట్లో బిర్యానీ రెడీగా ఉంటుంది. ప్రస్తుతానికి వారానికి మూడు రోజులు ‘బిర్యానీ బై ఎయిర్’ అందుబాటులో ఉంది. ‘బిర్యానీ బై ఎయిర్’ సర్వీస్‌ను మేం ఈ మధ్యే మొదలు పెట్టాము. నాలుగు నెలలుగా ఆర్డర్లను బట్టి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వారానికి మూడు రోజులే సర్వీస్ ఉన్నా.. ఆ మూడు రోజుల్లోనే కనీసం రెండు వేల జంబో బిర్యానీల వరకు ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. ఎక్కువ శాతం మటన్ బిర్యానీని కావాలంటున్నారు’ అంటున్నారు షా గౌస్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్ మహ్మద్ రబ్బానీ.
- శిరీష చల్లపల్లి

Advertisement

తప్పక చదవండి

Advertisement