-
ప్లస్ టేస్ట్.. ప్లస్ ఏరియా..
చార్మినార్.. చారిత్రాత్మకంగా సిటీకి ప్లస్. హలీమ్.. రంజాన్ మాసంలో సిటీకి అందే ప్లస్ రుచి. హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచ ఖ్యాతి చెందిన ఈ ఘుమఘుమలు.. టేస్ట్ ఆఫ్ సిటీకి మెగా ప్లస్‌గా నిలిచింది. ఒక్కసారి ఈ దక్కన్ బిర్యానీ ముద్ద గొంతులోకి దిగితే.. మరో బిర్యానీ రుచి చేసినప్పుడల్లా.. హైదరాబాద్ గుర్తుకు రావాల్సిందే. హైదరాబాదీలకు అనుకున్నదే తడవుగా బిర్యానీ లాగించే అవకాశం ఉంది. మరి ఇతర నగరవాసులుకో..? మన సిటీ బిర్యాని టేస్ట్ చూడాలంటే వారంతా హైదరాబాద్‌కు రానక్కర్లేదు. మన సిటీ రెస్టారెంట్స్ బిర్యానీని వేడివేడిగా ఇతర రాష్ట్రాలకూ వడ్డించేస్తున్నాయి. మన సిటీలోని రెస్టారెంట్స్‌లో రాజస్థానీ ఫుడ్‌ఫెస్టివల్, పంజాబీ రుచులు, గుజరాతీ టేస్ట్లంటూ రోజూ ఏదో ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ.. హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్స్ ఘనంగానే జరుగుతుంటాయి. చేయి తిరిగిన నలభీములు వండి వార్చినా.. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ తీసుకురాలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ ‘బిర్యానీ బై ఎయిర్’ కాన్సెప్ట్ మొదలైంది. బెంగళూరు, ముంబై, పూణె.. నగరమేదైనా సరే హైదరాబాద్ దమ్ కీ బిర్యానీ రుచి చూడాలనుకుంటే ఇప్పుడు గంటల్లో పని. కాల్ చేసి ఆర్డర్ చేస్తే సరి సాయంత్రానికి వాళ్లింట్లో బిర్యానీ రెడీగా ఉంటుంది. ప్రస్తుతానికి వారానికి మూడు రోజులు ‘బిర్యానీ బై ఎయిర్’ అందుబాటులో ఉంది. ‘బిర్యానీ బై ఎయిర్’ సర్వీస్‌ను మేం ఈ మధ్యే మొదలు పెట్టాము. నాలుగు నెలలుగా ఆర్డర్లను బట్టి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వారానికి మూడు రోజులే సర్వీస్ ఉన్నా.. ఆ మూడు రోజుల్లోనే కనీసం రెండు వేల జంబో బిర్యానీల వరకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎక్కువ శాతం మటన్ బిర్యానీని కావాలంటున్నారు’ అంటున్నారు షా గౌస్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్ మహ్మద్ రబ్బానీ. - శిరీష చల్లపల్లి -
ఊరగాయ మాంసం.. జ్యుజెజాన్ బిర్యానీ
దాదాపు అన్ని రకాల క్వీజిన్స్ను మెనూలో తప్పకుండా పొందుపరిచే సిటీ రెస్టారెంట్స్... కాస్త ఆలస్యంగాైనె నా తెలంగాణ వంటకాలను గుర్తించడం ప్రారంభించాయి. ఒకటొకటిగా స్థానిక వెరైటీలను తమ అతిథులకు పరిచయం చేస్తూ వస్తున్నాయి. సిటీలో ఉన్న వందలాది మంది ‘ఫుడీస్’లో ఒకడిగా రెస్టారెంట్స్‌ను క్రమం తప్పకుండా సందర్శించే నేను ఫిలిమ్నగర్లో ఉన్న ‘సింప్లీ సౌత్- బై చెఫ్ చలపతిరావు’ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు ఈ విషయం తెలిసొచ్చింది. సిటీలో స్టార్ హోటల్స్‌లో చెఫ్‌లుగా పనిచేసినవారు సొంత రెస్టారెంట్స్ ఆలోచన చేయడం అరుదే. ఎందుకంటే బోలెడంత ఫ్యూచర్ ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని ఆదాయానికి గ్యారంటీ లేని వ్యాపారంలోకి ఎందుకొస్తారెవరైనా? అయితే చెఫ్ చలపతిరావు ఈ సూత్రాన్ని తిరగరాశారు. ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లే అతిథులకు ఆయన చిరపరిచితుడు. ‘చల్లూ’గా మాలాంటి భోజనప్రియులు పిలిచే ఈ హైదరాబాదీ సెలబ్రిటీ చెఫ్ ఇప్పుడు ‘సింప్లీ సౌత్’ యజమాని. ఈ రెస్టారెంట్ మెనూను చేతిలోకి తీసుకుని తిరగేస్తుంటే... సింప్లీ సౌత్ అన్న పేరులో ఎంత సౌమ్యత ఉన్నా... వంటకాలు మాత్రం అంత సింపుల్ జాబితా ఏమీ కాదని తెలిసొస్తుంది. ముఖ్యంగా హాట్, స్పైసీ రుచులకు పేరుపడ్డ తెలంగాణ వంటలూ ఈ మెనూలో తగిన స్థానం దక్కించుకున్నాయి. వాటిలో చాలా రకాలున్నా... ‘ఊరగాయు మాంసం’ మాత్రం నోరూరించింది. బాగా స్పైసీగా, రుచిగా ఉంది. గొర్రెపోతు మాంసం తాలూకు ముక్కల్ని సరైన విధంగా మసాలా పచ్చడిలో ఉడికించినట్టుంది. అన్నం, రోటీ, పరోటా వంటివాటి కాంబినేషన్లో ఈ బోన్‌లెస్ మటన్ కర్రీ అదరహో అనిపిస్తుంది. మిస్సవ్వకుండా టేస్ట్ చేయాల్సిన ‘అంబాడా గోస్త్’ మరో హైదరాబాద్ వంటకం. గోంగూర రుచికే కాదు.. ఐరన్, విటమిన్స్కూ నిలయం. మాంసంతో కలిపి వండినప్పుడు ఇది మరింత రుచిగా, బలవర్ధకంగా మారుతుంది. హైదరాబాదీగా.. బిర్యానీ తినకపోతే అదో వెలితి కదా. మెనూలో ‘జ్యుజెజాన్ బిర్యానీ’ అనే వెరైటీ వంటకం కనిపించింది. హైదరాబాద్ బిర్యానీ, ఆంధ్రా బిర్యానీలకు ఇది పూర్తిగా విభిన్నం. పురాతన కాలం నాటి సంప్రదాయ బిర్యానీ ఇది. తొలుత చికెన్‌ని బాస్మతీ రైస్‌తో కలిపి వండుతారు. తర్వాత దమ్తో ముగిస్తారు. తద్వారా ఇది మరింత లైట్‌గా, ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడుతుంటుంది. పొట్ట మరీ నిండుగా అనిపించకుండా మరింత తినాలనిపించేలా ఉంటుంది. చివరగా నా భోజనాన్ని షీర్ కుర్మాతో పూర్తి చేయడానికి సిద్ధమయ్యా. మొఘలాయి సంప్రదాయం అందించిన ఈ స్వీట్ షీర్‌కుర్మా రంజాన్ పండుగ సమయంలో బాగా పాపులర్ కదా. అయితే ఈ రెస్టారెంట్ దీన్ని ఏడాదంతా వడ్డిస్తుండడం విశేషం. సేమియా పాయసానికి దగ్గరగా ఉండే దీన్ని పాలు, డేట్స్, వెర్మిసెల్లిలో నాణ్యమైన రకం వాడి చేశారు. నోట్లో పెట్టుకోగానే రుచి అమాంతం దేహమంతా పాకినట్టనిపించింది. మరో విశేషం ఏమిటంటే... ఇది చిల్డ్గానూ, వేడిగానూ సర్వ్ చేస్తున్నారు. - విశాల్
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..
కొండెక్కిన చికెన్! మంట పుట్టిస్తున్న మటన్..
హిమాచల్ అడవుల్లోనూ కార్చిచ్చు
అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం
తెలుగు ఓటర్లు కీలకం
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్‌పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement