ఆలూతో అందంగా..! | Sakshi
Sakshi News home page

ఆలూతో అందంగా..!

Published Sun, Mar 8 2015 1:01 AM

ఆలూతో అందంగా..!

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆహారంలో ఉపయోగించే కాయగూరల్లో తొలిస్థానంలో ఉంటుంది ఆలుగడ్డ. ఇది కేవలం ఆహారంగా మాత్రమే కాదు... అందం విషయంలో కూడా చాలా ప్రభావాన్ని చూపగలదు.
* ఆలూ నుంచి తీసిన రసాన్ని పట్టిస్తే కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు తొలగిపోతాయి.
* మనిషిని నిత్యయవ్వనంతో మెరిపించే శక్తి ఉంటుంది బంగాళదుంపకి.

* దాన్ని స్లైసుగా కోసి తరచూ మొహానికి అప్లై చేస్తుంటే చర్మపు మడతలు తగ్గుతాయి.
* మొహంపై ఉండే నల్లమచ్చలను కూడా తొలగించే శక్తి ఉంటుంది పచ్చి ఆలుగడ్డకి. చర్మంపై మృతకణాలను ఇది తొలగిస్తుంది.
* శిరోజ సంరక్షణకు కూడా ఇది ఉపకరిస్తుంది. ఒక  ఆలుగడ్డ నుంచి రసాన్ని తీసి దానికి కోడిగుడ్డు తెల్లసొనను, కొంచెం నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు, మాడుకు పట్టించవచ్చు. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యవంతం అవుతాయి. మెరుస్తాయి.

Advertisement
Advertisement