భాషణం: బుద్ధిగా ఉండకపోతే బూచాడు ఎత్తుకెళతాడు! | Sakshi
Sakshi News home page

భాషణం: బుద్ధిగా ఉండకపోతే బూచాడు ఎత్తుకెళతాడు!

Published Sun, Nov 24 2013 3:25 AM

భాషణం: బుద్ధిగా ఉండకపోతే బూచాడు ఎత్తుకెళతాడు! - Sakshi

ఐదు రోజుల క్రితం నవంబర్ 19 న ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’ జరిగింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం! మార్చి 8న ఉమెన్స్ డే ఉంది కాబట్టి మాకూ ఒక రోజు కావాలని కొంతమంది మగవాళ్లు పట్టుబట్టి మరీ ‘మెన్స్ డే’ని సాధించుకున్నారు. బాగుంది. ‘వాళ్లకు ఉంది కాబట్టి మాకూ ఉంటే బాగుంటుంది’ అనేది మానవ స్వభావం కనుక దీని గురించి వాదన అవసరం లేదు కానీ, ఆ సందర్భాన్ని ప్రస్తావించుకుంటూ ఇప్పుడు మనం man కు సంబంధించి మరీ ఆసక్తిగా అనిపించే కొన్ని పదబంధాల గురించి మాట్లాడుకుందాం.
 అందరికీ తెలిసిన మాట angry young man. అయితే కోపం తెచ్చుకునే ప్రతి యువకుడూ యాంగ్రీ యంగ్‌మేన్ కాదు. వ్యవస్థలో ఉన్న ప్రజావ్యతిరేక విధానాలను, అధికారంలో వ్యక్తుల పనితీరును ధర్మాగ్రహంతో ప్రశ్నించే యువకుడు యాంగ్రీ యంగ్‌మేన్.
 best man అంటే మాత్రం తోడి పెళ్లికొడుకని. సాధారణంగా అతడు వరుడి స్నేహితుడై ఉంటాడు. లేదా బాగా దగ్గరి బంధువై ఉంటాడు. వివాహ వేడుకలో వరుడి పక్కనే ఉండి అతడి అవసరాలను చూస్తుండడం best man పని.


 bogey man అని ఇంకొకడు ఉన్నాడు. వీడిని బోగీ మేన్ అని పలకాలి. బూచాడని అర్థం. Be good, or the bogey man will come and get you! బుద్ధిగా ఉండు, లేకుంటే బూచాడు ఎత్తుకెళతాడని పిల్లల్ని భయపెట్టడం. bogey man¯ól boogeyman అని కూడా అంటారు.
 company man అంటే ఆఫీసుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. కంపెనీ మేన్‌కి ఆఫీస్ తర్వాతే ఇల్లు, కుటుంబం. ఇలాంటి వాళ్లని పై అధికారులు మెచ్చుకుంటారేమో కానీ, సహోద్యోగులు భరించలేరు. ఆ సహోద్యోగుల తిరస్కారభావం నుంచి వచ్చిందే company man అనే మాట.
 ఇక con man అంటే కంత్రీ. జనాన్ని మాయ చేసి, డబ్బుతో ఉడాయించేవాడు. con man movies హాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో చాలా వచ్చాయి. ఆ మధ్య నాగార్జున హీరోగా వచ్చిన ‘కేడీ’ చిత్రం కూడా కాన్ మేన్ మూవీ లాంటిదే.
 అలాగే fancy man, fellow man, front man అనేవాళ్లున్నారు. ‘ఫ్యాన్సీ మేన్’ అంటే లవర్. ఓల్డ్ ఇంగ్లిష్‌లో ఇలా అనేవారు. ‘ఫెలో మేన్’ అంటే సాటి మనిషి. ‘ఫ్రంట్ మేన్’ అంటే కంపెనీ తరఫున ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే వ్యక్తి. ప్రతినిధి అన్నమాట. చట్టబద్ధత లేని కంపెనీ తరఫున ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసే ప్రతినిధిని కూడా ‘ఫ్రంట్ మేన్’ అనే అంటారు.
 gingerbread man అనేది ఒక చిత్రమైన మాట. ఇందులో man అనే పదం ఉంది కదా అని అనుకుంటాం కానీ. జింజర్‌బ్రెడ్ మేన్ మనిషి కాదు, మనిషి ఆకారంలో ఉండే అల్లం బిస్కెట్. లేదా అల్లం కుకీ.
 G-man అంటే యు.ఎస్.లో ప్రభుత్వ అధికారి. ప్రధానంగా ఊఆఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో పని చేసే అధికారి. Hit man అంటే కిరాయి హంతకుడు.
 ladies man అంటే ఎప్పుడూ ఆడవాళ్ల గురించే ఆలోచిస్తుండే వ్యక్తి. ‘లేడీస్ మేన్’ ధ్యాసంతా ఆడవాళ్ల మీదే ఉంటుంది. అంతేకాదు, అతడెప్పుడూ ఆడవాళ్ల మధ్య ఉండడానికే ఇష్టపడతాడు.
 lollipop man అంటే స్కూలు పిల్లల్ని భద్రంగా రోడ్డు దాటించే వ్యక్తి. అతడు రోడ్డు మధ్యలో నిలబడి ఉంటాడు. అతడి చేతిలో ఒక స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ మీద ‘స్టాప్’ అని సింబల్ ఉంటుంది. ఆ సింబల్‌తో అతడు ట్రాఫిక్‌ని నియంత్రిస్తూ, పిల్లల్ని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తుంటాడు.
 man of God అంటే మత బోధకుడు. man of letters  అంటే రచయిత, సాహితీవేత్త. man of straw అంటే మానసికంగా బలహీనుడు.
 medallion man (మెడాలియన్ మేన్) అంటే వయసుని తగ్గించుకుని కనిపించడానికి ఆభరణాలు, బిగుతైన దుస్తులు ధరించే వ్యక్తి. మెడాలియన్ మేన్‌లో ఇంకో గుణం కూడా ఉంటుంది. షర్ట్ పై బటన్‌లు తీసి ఛాతీని ప్రదర్శిస్తూ ఉంటాడు.
 
 man Friday
 ఇక్కడ ఊ క్యాపిటల్ లెటర్. ‘మేన్ ఫ్రైడే’ అంటే విధేయుడైన, నమ్మకస్తుడైన సహాయకుడని. అయితే విధేయతకు, నమ్మకానికీ, D Friday  అనే మాటకు సంబంధం ఏమిటి? ఉంది. ఇంగ్లండ్ రచయిత డేనియల్ డెఫో 1719లో రాసిన ‘రాబిన్‌సన్ క్రూసో’ నవలలో Friday  అనేది మగ సహాయకుని పాత్ర. ఆ పాత్ర తన యజమాని రాబిన్‌సన్ క్రూసోకు ఎంతో విధేయంగా, నమ్మకంగా ఉంటుంది. అలా వచ్చిందే man Friday  అనే మాట. రాబిన్‌సన్‌కు మొదట ఆ సహాయకుడి పేరు తెలియకపోవడంతో అతడు తారసపడిన రోజు (ఫ్రైడే)తో అతడిని పిలుస్తుంటాడు.అలా మేన్ ఫ్రైడే వాడుకలోకి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement