కిడ్నీమార్పిడి కేసు..సెంట్రల్‌ కమిటీ వివరణ | Sakshi
Sakshi News home page

కిడ్నీమార్పిడి కేసు..సెంట్రల్‌ కమిటీ వివరణ

Published Fri, Jan 5 2018 11:30 AM

kidney transplantation..central commitee explanation

గుంటూరు : కిడ్నీ మార్పిడి రాకెట్‌ గుట్టురట్టు కావడంతో సెంట్ర‌ల్ క‌మిటీ ఈ విషయంపై స్పందించింది. శుక్రవారం సెంట్రల్‌ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..శివ‌నాగేశ్వ‌ర‌రావు కిడ్నీ మార్పిడి  వ్య‌వ‌హ‌రంలో విజ‌య‌వాడ ఆయుష్ హ‌స్ప‌ట‌ల్ యాజమాన్యం నిబంధలు పాటించలేదని తెలిపారు. గుంటూరు వేదాంత ఆసుపత్రిలో మాత్ర‌మే శివ‌నాగేశ్వ‌ర‌రావుకు క‌మిటి ప‌ర్మిష‌న్ ఇచ్చిందని వివరించారు.

 ఆయుష్ ఆసుపత్రి శివ‌నాగేశ్వ‌ర‌రావుకు కిడ్నీ మార్పిడికి సంబంధించి తమకు ద‌ర‌ఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఒక ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి అనుమ‌తి తీసుకుని మ‌రో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకోకూడదన్నారు. ఏ ఆసుపత్రి అయినా కిడ్నీ మార్పిడి చేసే ముందు కిడ్నీ మార్పిడి క‌మిటి స‌మాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement