ఒకే గ్రామానికి చెందిన పదిమందికి రైల్వే ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

ఒకే గ్రామానికి చెందిన పదిమందికి రైల్వే ఉద్యోగాలు

Published Fri, Dec 11 2015 7:46 PM

10 members selected for Railway jobs in Jalajarao pet

నెల్లిమర్ల (విజయనగరం) : శుక్రవారం రైల్వే శాఖ ప్రకటించిన గ్రూప్‌-డి ఉద్యోగాల ఫలితాలలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన 10 మంది యువకులు ఉద్యోగాలు సాధించారు. స్థానిక జలజరావుపేటకు చెందిన 10 మంది యువకులు రైల్వే గ్రూప్‌-డిలో టెక్నికల్, క్లరికల్ ఉద్యోగాలు సాధించారు. దీంతో జలజరావుపేటలో సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో జలజరావుపేట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో 2011లో జరిగిన కానిస్టేబుల్ ఎంపిక ప్రకియలో ఇదే గ్రామానికి చెందిన 36 మంది యువకులు ఉద్యోగాలు సాధించడం విశేషం.

Advertisement
Advertisement