ఎనీటైం నో క్యాష్! | Sakshi
Sakshi News home page

ఎనీటైం నో క్యాష్!

Published Sat, Nov 26 2016 12:29 AM

ఎనీటైం నో క్యాష్! - Sakshi

బ్యాంకులు..ఏటీఎంల వద్ద  ఇవే బోర్డులు..
నగదు అందక జనం పాట్లు
రోజురోజుకు దిగజారుతున్న వ్యాపారాలు
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు..
పాత వెరుు్య నోట్ల స్వీకరణకు పెట్రోలు బంకుల నిరాకరణ...
వీకెండ్‌లో జనం అవస్థలు..

సిటీబ్యూరో: కరెన్సీ కష్టాలు సగటుజీవిని అతలాకుతలం చేస్తున్నారుు. బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయక..నగదు అందక జనం విలవిల్లాడుతున్నారు. నగరంలో ఏ బ్యాంకు వద్ద చూసినా..ఏ ఏటీఎంకు వెళ్లినా ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తున్నారుు. ఉన్న పాతనోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి..చేతిలో చిల్లిగవ్వ లేక డబ్బుల కోసం ప్రజలు వీధివీధి తిరగాల్సి వస్తోంది. బ్యాంకుల్లో నగదు మార్పిడి నిలిచిపోవడంతోపాటు అరకొరగా రూ.500 నోట్ల పంపిణీ...రూ.2 వేల నోట్లకు చిల్లర దొరక్కపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇక వెరుు్యనోట్లు బయట చెల్లవని చెప్పడంతో శుక్రవారం వాటిడిపాజిట్ల కోసం పలు బ్యాంకుల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం బారులు తీరారు. మరోవైపు నోట్ల ఎఫెక్ట్‌తో టీ కొట్టు మొదలు...సూపర్‌మార్కెట్లు, హైపర్‌మార్కెట్లు, బేగంబజార్, సుల్తాన్‌బజార్, మోండామార్కెట్‌లు వెలవెలబోతున్నారుు.

చిల్లర దొరక్క జనం అవస్థలు పడగా..వ్యాపారాలు లేక యజమానులు దిగాలుగా కూర్చోవడం గమనార్హం. రద్దరుున పాత రూ.500 నోట్లతో రైలు, బస్సు టిక్కెట్ల బుకింగ్‌కు అనుమతించడం గుడ్డిలో మెల్ల. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడా రైల్వే స్టేషన్ల వద్దకు పాత వెరుు్య నోట్లతో వచ్చినవారికి అవస్థలు తప్పలేదు. పెట్రోలు బంకుల నిర్వాహకులు సైతం పాత రూ.500 నోట్లు మాత్రమే స్వీకరించారు. కాగా ఈ నోట్ల స్వీకరణతో జలమండలికి రూ.కోటి రూపాయల పెండింగ్ నీటి బిల్లులు వసూలయ్యారుు. సీపీడీసీఎల్‌కు సుమారు రూ.5 కోట్ల మేర బకారుులు వసూలైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

బ్యాంకులకు భారీగా డిపాజిట్లు..?
పాత వెరుు్య నోట్ల  స్వీకరణకు పలు సంస్థలు నో చెప్పడంతో గ్రేటర్ పరిధిలోని 1435 బ్యాంకులకు జనం పోటెత్తారు. తమ వద్దనున్న పాతనోట్లను భారీగా డిపాజిట్లు చేశారు. శుక్రవారం ఒకేరోజు ఆయా బ్యాంకులకు సుమారు రూ.100 కోట్ల మేర డిపాజిట్లు అరుునట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఇక నగరంలోని 107 పోస్టాఫీసులుండగా..వీటిల్లో సుమారు రూ.30 కోట్లు డిపాజిట్ అరుునట్లు తెలిసింది.

Advertisement
Advertisement