ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్

Published Sat, Sep 3 2016 7:46 PM

atm theft accused arrested in hyderabad

హైదరాబాద్: ఏటీఎం కేంద్రంలో చోరీకి యత్నించిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మాసాబ్‌ట్యాంక్‌లో నివాసముండే ఫరీద్‌ఖాన్(23) గతంలో సైఫాబాద్ ప్రాంతంలో ఏటీఎం కేంద్రంలో చోరీకి పాల్పడి జైలుకు వెళ్లాడు.

లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిదిలోని గుడిమల్కాపూర్ పీవీనర్సిహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 83 వద్ద లక్ష్మీ విలాస్ బ్యాంకు ఉంది. దానికి ఆనుకొనే ఉన్న బ్యాంకు ఏటీఎంలో గత నెల 31వ తేది అర్దరాత్రి ఫరీద్ చోరీకి యత్నించాడు. సెన్సార్‌తో ఉన్న గాజు అద్దం తెరుచుకోకపోవడంతో రాయితో అద్దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అలజడికి అక్కడకు కొందరు చేరుతుండటం గమనించి పారిపోయాడు. సీసీ ఫుటేజి ఆధారంగా లంగర్‌హౌస్ పోలీసులు ఫరీద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement