సిటీకి చేరిన మెట్రో టికెట్ విక్రయ యంత్రం | Sakshi
Sakshi News home page

సిటీకి చేరిన మెట్రో టికెట్ విక్రయ యంత్రం

Published Sat, Mar 1 2014 3:15 AM

సిటీకి చేరిన మెట్రో టికెట్ విక్రయ యంత్రం - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి టికెట్లు జారీచేసే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ యంత్రాలు (ఏఎఫ్‌సీ) కొరియా నుంచి నగరానికి చేరుకున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. వీటిని శ్యామ్‌సంగ్ కంపెనీ తయారు చేసింది. ఈ యంత్రాల పనితీరును కొరియా ప్రతినిధి యంగ్ ఇల్ కిమ్ శుక్రవారం ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ వీబీగాడ్గిల్ ఇతర అధికారులకు వివరించారు.
 
 ఈ యంత్రాల ప్రత్యేకతలివే..
 ఈ యంత్రం ఏటీఎంలను పోలి ఉంటుంది.
 
 టికెట్ తీసుకునేందుకు వెళ్లే మార్గంలో గేట్లు ఉంటాయి.
 
 ప్రయాణికులు నేరుగా ఈ యంత్రాన్ని ఆశ్రయించి టికెట్ కొనుగోలు చేయవచ్చు.
 
  నగదు లేదా క్రెడిట్, డెబిట్‌కార్డులు వినియోగించి టికెట్ తీసుకోవచ్చు.
 
  టికెట్ జారీలో ఆలస్యమన్నదే ఉండదు.
 
  వికలాంగులు కూడా తేలికగా టికెట్ తీసుకోవచ్చు.
 
 టచ్‌స్క్రీన్ మెనూ ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
 

Advertisement
Advertisement