విద్యా వ్యాపారంలోకి సీఎం కుటుంబం | Sakshi
Sakshi News home page

విద్యా వ్యాపారంలోకి సీఎం కుటుంబం

Published Wed, May 17 2017 3:44 AM

విద్యా వ్యాపారంలోకి సీఎం కుటుంబం - Sakshi

అందుకే ప్రభుత్వ విద్యను నీరుగారుస్తున్నారు: ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: విద్యావ్యాపారంలోకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబం వచ్చిందని, అందుకే ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేస్తున్నదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ విద్యాసంస్థలను స్థాపించిన కేసీఆర్‌ కుటుంబానికి ప్రయో జనం చేకూర్చడానికే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రైవేట్‌ వర్సిటీల బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. ఉన్నత విద్యారంగాన్ని బలహీన పర్చడానికే వర్సిటీలకు వీసీలను నియమించడం లేదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులలో దోచు కుంటున్న సొమ్మును కేసీఆర్‌ కుటుంబసభ్యులు విద్యా వ్యాపారంలోకి మళ్లిస్తు న్నారని, భారీగా పెట్టుబడులు పెడుతున్నారని వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఏ ఆంధ్రా విద్యాసంస్థలను తెలంగాణ నుంచి తరిమేస్తామని అప్పుడు హెచ్చరించారో వాటిలోనే భారీగా వాటాలు కొంటున్నారని ఆరోపించారు. మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ సీటకూ భారీగా ఫీజులు పెంచారని విమర్శించారు.

Advertisement
Advertisement