విస్ఫోటం | Sakshi
Sakshi News home page

విస్ఫోటం

Published Sat, Dec 13 2014 12:24 AM

విస్ఫోటం - Sakshi

వంట ప్రయత్నంలో పేలుడు
ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మృత్యువుతో పోరాడుతున్న బాలుడు
కెమికల్ డబ్బానే కారణంగా భావిస్తున్న పోలీసులు
 

వెంగళరావునగర్: వంట కోసం వెలిగించిన నిప్పు తమ చితిమంటగా మారుతుందని ఆ చిన్నారులు ఊహించలేదు. అమ్మానాన్నలు వచ్చేసరికి భోజనం సిద్ధం చేస్తామని తలచిన వారు అనుకోకుండా మృత్యువాత పడ్డారు. ఇంట్లో దాచిన కచ్చా సొల్యూషన్ స్పిరిట్ (సినిమా షూటింగ్స్‌లో త్వరగా మంటలు వ్యాపించే సీన్‌ల కోసం వాడేది) డబ్బానే మృత్యుపాశమైంది. ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. వెంగళరావునగర్ డివిజన్ జవహర్ నగర్ బస్తీలో  శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కింగ్‌కోఠిలో నివాసం ఉండే బర్కత్ జవహర్‌నగర్‌లోని 60 గజాల స్థలంలో ఆరు గదుల ఇళ్లు నిర్మించి కూలీలకు అద్దెకు ఇచ్చాడు. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదినారాయణ, హేమలత దంపతులు, దాలయ్య, సరస్వతి దంపతులు అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం వారు తమ పిల్లలను ఇళ్ల వద్దనే వదిలిపెట్టి కూలి పనులకు వెళ్లారు. ఆదినారాయణ,హేమలత దంపతుల పిల్లలు కీర్తివాణి(7), యోగి(5)తో పాటు దాలయ్య, సరస్వతి దంపతుల కుమార్తె నర్సమ్మ(13) ఇంట్లో కూర వండుకునేందుకు కట్టెల పొయ్యి వెలిగించే ప్రయత్నంలో స్పిరిట్‌ను కట్టెలపై పోశారు. దీంతో అకస్మాత్తుగా డబ్బాకు నిప్పంటుకోవడంతో అది భారీ శబ్దంతో పేలింది.

పేలుడు దాటికి ఇంటి ఆవరణలోని ఇనుప గేటు విరిగింది. ముగ్గురు పిల్లలు అమాంతం గాల్లోకి ఎగిరి తలోదిక్కున పడ్డారు. బాలుడు సంపులో పడగా... నర్సమ్మ ఇంటి ఆవరణలోనే మరోదిక్కున పడిపోయింది. కీర్తివాణి మాత్రం తలుపునకు కొట్టుకుంది. ఇద్దరు బాలికలకు ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలు కాగా, బాలుడికి ఒళ్లంతా గాయాలయ్యాయి. పేలుళ్ల శబ్దం విని పక్కనే ఉన్న కీర్తివాణి తాతయ్య హుటాహుటిన చిన్నారుల వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో విలవిలలాడుతున్నారు. దాంతో కేకలు వేస్తూ ఆయన చుట్టుపక్కల వారిని పిలిచాడు. స్థానిక యువకులు 108 అంబులెన్స్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. 108 సిబ్బంది బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు బాలికలు నర్సమ్మ(13), కీర్తివాణి(7)లు చికిత్సపొందుతూ మృతిచెందారు. ఐదేళ్ల బాలుడు యోగి ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు ఘోర దుర్ఘటన చూసి హతాశులయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు సంభవించిన ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు (పెద్దది, చిన్నది), స్టౌ, విద్యుత్ సామాగ్రి ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. ఇంట్లోని విద్యుత్ వైర్లు కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు.  

స్పిరిట్ డబ్బానే ప్రమాదానికి కారణం

పేలుడు ఘటనకు ఇంట్లో దాచిన కచ్చా సొల్యూషన్ స్పిరిటే కారణం. మృతిచెందిన బాలిక నర్సమ్మ తల్లి సరస్వతి రెండు నెలల కిందట వరకు సారథి స్టూడియోలో పని చేసేది. స్టూడియోలో సినిమా షూటింగ్స్‌లలో భాగంగా త్వరగా మంటలు అంటుకునేందుకు కచ్చా సొల్యూషన్ అనే స్పిరిట్‌ను వాడతారు. తన ఇంట్లో కూడా కట్టెల పొయ్యిని త్వరగా వెలిగించేందుకు ఆమె దీన్ని ఇంట్లో తెచ్చిపెట్టు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement