కార్డన్‌ సెర్చ్‌.. 14 మంది నైజీరియన్ల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కార్డన్‌ సెర్చ్‌.. 14 మంది నైజీరియన్ల అరెస్ట్‌

Published Sun, May 7 2017 7:48 AM

కార్డన్‌ సెర్చ్‌.. 14 మంది నైజీరియన్ల అరెస్ట్‌ - Sakshi

హైదరాబాద్‌: నగరంలోని టోలీచౌకీ ఏరియా ఐఏఎస్‌ నగర్‌, బృందావన్‌ నగర్‌, ఫాతిమానగర్‌ కాలనీలలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 14 మంది నైజీరియన్లు ఉన్నారని వీరిని విచారించి పత్రాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశీయులు నివాసం ఉండే ఇంటి ఓనర్లను అడిగి వారి వివరాలు తెలుసుకుంటామన్నారు.

గోల్కొండ, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 300 మంది పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వయించాయి. 63 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎలాంటి పత్రాలు లేనివిగా గుర్తించిన 103 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా విదేశీయుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం.

Advertisement
Advertisement