పోస్టాఫీసుల్లో కంచే చేను మేసింది! | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల్లో కంచే చేను మేసింది!

Published Mon, Dec 12 2016 3:08 AM

పోస్టాఫీసుల్లో కంచే చేను మేసింది! - Sakshi

నగదు మార్పిడిలో అధికారుల చేతివాటం
4 పోస్టాఫీసుల పరిధిలో రూ.3.75 కోట్ల గోల్‌మాల్

 
 సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి అక్రమాల బండారం బయటపడుతోంది! పోస్టాఫీసుల్లో సగానికి పైగా లావా దేవీలు కమీషన్ దందాపై జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ, బషీర్‌బాగ్ తదితర సబ్ పోస్టాఫీసుల్లో సుమారు రూ. 3.75 కోట్ల నగదు మార్పిడి లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోస్టల్ శాఖ సైతం అంతర్గత విజిలెన్‌‌స బృందాలను రంగంలోకి దింపింది.

 అక్రమాలు ఇలా..
 హైదరాబాద్ నగరం రీజియన్‌లో హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సౌత్-ఈస్ట్, సికింద్రాబాద్ అనే 3 డివిజన్లు ఉన్నాయి. డివిజన్‌కు ఒక సీనియర్ సూపరింటెండెంట్ ఉంటారు. బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీని డ్రా చేసే అధికారం కేవలం హెడ్ పోస్టాఫీసు చీఫ్ పోస్ట్ మాస్టర్‌కు ఉంటుంది. అయితే వాటి పరిధిలోని సబ్ పోస్టాఫీసులకు నగదు పంపించే ఇండెంట్‌పై పర్యవేక్షణ అధికారం మాత్రం సంబంధిత డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్‌కు ఉంటుంది. దీంతో సదరు అధికారి తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని వినియోగించుకొని అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.

బ్యాంకుల నుంచి హెడ్ పోస్టాఫీసుల ద్వారా పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీని డ్రా చేరుుంచి వాటిని సబ్ పోస్టాఫీసులకు సుమారు కోటి నుంచి రూ.2 కోట్ల చొప్పున పంపిణీ జరిగేలా చూశారు. అయితే భద్రత దృష్ట్యా సబ్ పోస్టాఫీసులు పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీని దగ్గర పెట్టుకోవడానికి ఆసక్తి కనబర్చలేదు. దీంతో సబ్ పోస్టాఫీసులతో లేఖ తీసుకొని తిరిగి హెడ్ పోస్టాఫీసులకు కొత్త కరెన్సీ అప్పగింత సమయంలో అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు.

Advertisement
Advertisement