ముదిరిన ‘ఆస్తి’ వివాదం | Sakshi
Sakshi News home page

ముదిరిన ‘ఆస్తి’ వివాదం

Published Thu, Oct 6 2016 8:32 AM

ముదిరిన ‘ఆస్తి’ వివాదం

ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణకు దారితీసిన విచారణ
- ఏపీఎన్జీవో నేతలపై దాడికి బీటీఎన్జీవో నాయకుని యత్నం
- అర్ధంతరంగా విచారణ వాయిదా
 
 హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు ఆస్తుల వాటా విషయమై మరోసారి బాహాబాహీకి దిగారు. దీంతో బుధవారం నాంపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ఆస్తుల వాటాకు సంబంధించిన విచారణ ఉద్రిక్తతకు దారి తీసింది. గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో తమకు వాటా కల్పించాలని కోరుతూ ఏపీఎన్జీవో నుంచి విడిపోరుు భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(బీటీఎన్జీవో) హైదరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో)కు సెప్టెంబర్ 1న విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించిన ఆర్డీవో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఆస్తుల వాటా అంశం పరిశీలన నిమిత్తం విచారణాధికారిగా నాంపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లును నియమించారు.

ఇరు ఉద్యోగ సంఘాల నేతలను సెప్టెంబర్ 14న నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. విచారణలో ఇరు సంఘాల నేతలు  సమయాన్ని ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ వెంకటేశ్వర్లును కోరడంతో అక్టోబర్ 5కి విచారణ వారుుదావేశారు. దీంతో బుధవారం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, బీటీఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తమ కార్యవర్గం సభ్యులతో కలసి విచారణకు హాజరయ్యారు. ఇరు సంఘాల నేతలు తమ వాదనలు వినిపించారు. ఈ నెల 16న ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి సభ్యులతో చర్చించి తుది నివేదికను అందజేసేందుకు సమయం ఇవ్వాలని అశోక్‌బాబు అభ్యర్థించా రు. తాము ఏపీఎన్జీవోలో పనిచేసిన సభ్యులమేనని, తాము సభ్యత్వంతో పాటుగా, గచ్చిబౌలిలోని ఏపీఎన్జీవో హౌసింగ్ కార్పొరేషన్‌కు డబ్బులు చెల్లించామని, దీనిలో తాము పూర్తిగా నష్టపోరుునట్లు వివరించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎన్జీవో అనుబంధంగా కొనసాగిన నగరశాఖ నుంచి విడిపోరుు బీటీఎన్జీవో ఆవిర్భవించిందని, తమకు ప్రస్తుత ఏపీఎన్జీవో కార్యాలయంలో వాటా కావాలని సత్యనారాయణ కోరారు. ఇరువురు తమ వాదనలు వినిపిస్తుండగానే తహసీల్దార్ ఎదుటే బీటీఎన్జీవో  నాయకుడు ఒకరు ఏపీఎన్జీవో ఉద్యోగులపై దాడికి ప్రయత్నించాడు. ‘‘రాష్ట్రం విడిపోరుునా మీకు సిగ్గు లేదురా., ఇక్కడెందుకున్నార్రా.. ఏపీఎన్జీవోలు కనిపిస్తే కొట్టండ్రా’’ అంటూ వీరంగం సృష్టించాడు. మీ వల్ల తాను ఆర్థికంగా చితికిపోయానని, బంగారం అమ్మేసి గచ్చిబౌలిలో ప్లాట్ కేటారుుంపు కోసం లక్షన్నర రూపాయలు ఇచ్చానంటూ ఆ నాయకుడు ఊగిపోయాడు. దీంతో విచారణ అర్ధంతరంగా వారుుదా పడింది.
 
 అన్నీ పరిశీలించాకే..
 ఉద్యోగ సంఘాల వాదోపవాదనలు విన్నాం. రికార్డులను పరిశీలించాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక సమగ్ర నివేదికను అందజేస్తాం. రికార్డును ఫాలో అయ్యాకే తుది తీర్పును ఇస్తాం. ఉద్యోగులు విచారణలో ఘర్షణకు దిగడం బాధాకరం.                       
- వెంకటేశ్వర్లు, తహిసీల్దార్
 
 ముమ్మాటికీ మాకూ వాటా ఉంది

 రాష్ట్ర విభజనకు ముందు ఏపీఎన్జీవో భవన్ నిర్మాణం కోసం నిధులు సమీకరించాం. నగరంలో ఎంతో కష్టపడి సభ్యత్వాన్ని పెంచాం. ఇప్పుడు కాదు కూడదంటే ఎలా. ముమ్మాటికీ మాకు అందులో వాటా ఉంది. ఆ కార్యాలయంలోనే మాకూ కార్యాలయాన్ని కేటారుుంచాలి.         
- సత్యనారాయణ, బీటీఎన్జీవో అధ్యక్షుడు
 
 అది ప్రైవేట్ ఆస్తి

 గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవో కార్యాలయం ప్రైవేట్ ఆస్తి. అది ప్రభుత్వానికి చెందినది కానే కాదు. ఇందులో ఎవరికీ వాటాలు ఉండవు. బీటీఎన్జీవోలు అనవసరంగా వివాదాన్ని సృష్టిస్తున్నారు. విచారణకు ఆహ్వానించి దాడి చేయడం దారుణం.
 - అశోక్ బాబు, ఏపీఎన్జీవో అధ్యక్షుడు

Advertisement
Advertisement