జూలై 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు | Sakshi
Sakshi News home page

జూలై 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు

Published Tue, Apr 5 2016 3:41 AM

జూలై 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు - Sakshi

♦ జూన్ చివరికల్లా ప్రవేశాలు
♦ మే 15 నాటికే కాలేజీలకు అనుబంధ గుర్తింపు
♦ చర్యలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ తరగతులను ఈ సారి జూలై 1న కచ్చితంగా ప్రా రంభించేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మే 15 కల్లా పూర్తి చేయాలని హైదరాబాద్ జేఎన్‌టీయూతోపాటు ఉస్మానియా, కాకతీయ, ఇతర యూని వర్సిటీలకు సూచించింది. మూడేళ్లుగా రాష్ట్రం లో ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలాఖరుకల్లా ప్రవేశాలను పూర్తి చేసి జూలై 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఉన్నత వి ద్యామండలి సూచనల మేరకు ఆయా యూని వర్సిటీలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. మరోవైపు వచ్చే మూడేళ్లపాటు వసూలు చేసే ఫీజులను ఖరారు చేసేం దుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్ర ణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చర్యలు చేపట్టింది.

 సుప్రీంకోర్టు ఆదేశాల అమలు దిశగా...
 ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల  ప్రవేశాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసే దిశగా ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఏటా వివిధ కారణాలతో ప్రవేశాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అనుబంధ గుర్తింపు విషయం లో కాలేజీలకు అప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి లోపాలు సరిదిద్దుకోవాలని చెప్ప డం కాకుండా ముందుగానే కాలేజీలకు నోటీసులు జారీ చేసేలా విద్యా మండలి చర్యలు చేపట్టింది. అలాగే తరగుతులు ప్రారంభమయ్యాక జూలై 10 వరకు స్లైడింగ్‌కు అవకాశం ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
 
 పెరిగిన దరఖాస్తులు
 ఈసారి ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి ఎంసెట్‌కు దరఖాస్తులు పెరిగాయి. గతేడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం మొత్తం 2,32,047 మంది దరఖాస్తు చేసుకోగా అందు లో 1,39,682 మంది ఇంజనీరింగ్‌కు, 92,365 మంది అగ్రికల్చర్ మెడికల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ కలిపి 2,44,851 మంది (ఇందులో ఏపీ, ఇతర రాష్ట్రాల వారు 30 వేల మంది) దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రూ. 1000, రూ. 5000, రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకే 12 వేలమంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం 1,43,577 మంది (గతేడాది కంటే 3,895 మంది ఎక్కువ) దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం 1,01,274 మంది (8,909 మంది ఎక్కువగా) దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement
Advertisement