హైదరాబాద్, ఢిల్లీలలో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్, ఢిల్లీలలో భారీ వర్షం

Published Tue, Jul 26 2016 6:32 PM

హైదరాబాద్, ఢిల్లీలలో భారీ వర్షం - Sakshi

హైదరాబాద్/ఢిల్లీ: హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీలలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వర్షం నీరు రోడ్లపై ప్రవహించడం, ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అంబర్పేట, ఖైరతాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, నారాయణగూడ, కాచిగూడ, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహానాలు మొరాయించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.

ఈ రోజు ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఢిల్లీ తూర్పు, పడమర ప్రాంతాలు, నోయిడా, గుర్గావ్, గజియాబాద్లలో దాదాపు గంటకుపైగా భారీ వర్షం కురిసింది. ఢిల్లీలో బుధవారం మరింత భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెలాఖరు వరకు వర్షాలు ఇలాగే కురవవచ్చని పేర్కొంది.

Advertisement
Advertisement