Sakshi News home page

నగరంలో భారీ వర్షం

Published Wed, Sep 21 2016 2:54 AM

నగరంలో భారీ వర్షం - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రామచంద్రాపురంలో  2.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. షాపూర్ నగర్‌లో 2.3, మాదాపూర్‌లో 2.1 వర్షపాతం నమోదైంది.

అలాగే కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, బంజారాహిల్స్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఒక సెంటీమీటరు మేర కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫి క్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రాగల 24 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement