హలో కమిషనర్ | Sakshi
Sakshi News home page

హలో కమిషనర్

Published Fri, May 5 2017 1:49 AM

హలో కమిషనర్

నేడు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ ఇన్‌
ఉదయం 9  గంటల నుంచి 10 గంటల వరకు
తడి–పొడి చెత్త   విడాకులు, పారిశుధ్యం

హైదరాబాద్‌ వివిధ రంగాల్లో  ప్రపంచస్థాయి నగరాల సరసన నిలుస్తున్నప్పటికీ, వివిధ అంశాల్లో అగ్రస్థానంలో ఉంటున్నప్పటికీ, చెత్త–స్వచ్ఛతకు  సంబంధించి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇందులో భాగంగా ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాల పంపిణీ,  చెత్త తరలింపునకు ఆటోటిప్పర్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చర్యలు, పబ్లిక్‌ టాయ్‌లెట్ల పెంపు, షీ టాయ్‌లెట్లు, డ్రై రిసోర్స్‌ సెంటర్లు, సీఆర్‌పీల ఏర్పాటు,తదితర చర్యలెన్నో తీసుకున్నప్పటికీ ఇంకా బహిరంగంగా  చెత్త కనిపిస్తూనే ఉంది.  ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త వేరు కావడం లేదు.. నగరం  స్వచ్ఛంగా కనిపించడం లేదు.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 5న దేశంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఇళ్లనుంచి తడి,పొడి చెత్తను వేరుచేసే కార్యక్రమాన్ని  చేపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ.. మరింత ముందుకెళ్తూ, మరింత విస్తృతంగా  ఈనెల 5నుంచే శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో చెత్తను వేరుచేయడం, పారిశుధ్య కార్యక్రమాల అమలు, తదితర అంశాల గురించి ప్రజల సందేహాలు నివృత్తి చేసేందుకు, ప్రజల సూచనలు స్వీకరించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి అంగీకరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మీ అభిప్రాయాల్ని కమిషనర్‌తో ‘ఫోన్‌ ఇన్‌’ ద్వారా పంచుకోండి.  గ్రేటర్‌ హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మార్చడంలో మనందరం  భాగస్వాములవుదాం.. స్వచ్ఛహైదరాబాద్‌ సాధిద్దాం! ఒక్క ఫోన్‌కాల్‌తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

 

Advertisement
Advertisement