పంబా తీరంలో తెలంగాణ భవనం | Sakshi
Sakshi News home page

పంబా తీరంలో తెలంగాణ భవనం

Published Thu, Jan 7 2016 4:54 AM

Kerala govt allocates land for Telangana Bhavan

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్ప భక్తుల వసతి కోసం శబరిమలలో తెలంగాణ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. పంబా నదీ తీరంలో ఐదెకరాల్లో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. దీనికి సంబంధించి బుధవారం కేరళ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.


ఈ భవనం కోసం కేరళ ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం అయ్యప్ప దీక్షల నాటికి ఈ భవనం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. క్యాంటిన్, పార్కింగ్ వసతి కూడా ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. శబరిమలలో వేరే రాష్ట్ర వసతి భవనం రూపుదిద్దుకోవటం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలంగాణ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలన్న ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తికి కేరళ సీఎం ఉమన్ చాందీ సానుకూలంగా స్పందించారు.
 
 
 

Advertisement
Advertisement