సిరిసిల్ల రూపురేఖలు మారుస్తా: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల రూపురేఖలు మారుస్తా: కేటీఆర్

Published Sat, Mar 12 2016 2:36 AM

సిరిసిల్ల రూపురేఖలు మారుస్తా: కేటీఆర్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: తనకు రాజకీయ భిక్ష పెట్టి.. నిలబెట్టిన సిరిసిల్లను అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులతో మంత్రి శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న అమృత్ పథకంలో చేర్పించడం ద్వారా కనీసం రూ.60కోట్లు పొంది, సిరిసిల్ల పట్టణాన్ని విస్తరించేందుకు అవకాశం  ఉంటుందన్నారు.

సిరిసిల్ల చుట్టూ ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి రూ.30కోట్లు మంజూర య్యాయన్నారు. సిరిసిల్ల -సిద్దిపేట, సిరిసిల్ల-కామారెడ్డి వరకు రహదారి విస్తరణ, పట్టణంలో అంతర్గత రోడ్ల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎయిర్‌టెల్ సంస్థ రాష్ట్రంలోనే మొదటి మోడల్ స్కూల్‌ను రూ.10 కోట్లతో సిరిసిల్లలో నిర్మించనుందన్నారు. రాష్ట్రంలోనే తొలి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు, ఈ ఏడాది 1500 డబుల్ బెడ్‌రూం ఇళ్లు, చేనేత కార్మికులకు ప్యాకేజీ, నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

Advertisement
Advertisement