ఆ దుర్మార్గుల అమ్మ కూడా ఓ స్త్రీ యే: మోహన్బాబు | Sakshi
Sakshi News home page

ఆ దుర్మార్గుల అమ్మ కూడా ఓ స్త్రీ యే: మోహన్బాబు

Published Sat, Apr 4 2015 7:50 PM

మోహన్బాబు - Sakshi

హైదరాబాద్: గోవాలో నిన్న జరిగిన  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని కండోలిమ్ పట్టణంలోని 'ఫ్యాబ్ ఇండియా' షోరూమ్‌లో శుక్రవారం కొన్ని వస్త్రాలను స్మృతీ ఇరానీ కొనుగోలు చేశారు. వాటిని వేసుకుని చూసేందుకు ట్రయల్ రూమ్‌కు వెళ్లిన ఆమె అందులో ఒక రహస్య సీసీ కెమెరాను గుర్తించారు. ట్రయల్ రూమ్ వెంటిలేటర్‌పై నాలుగు నెలల కింద ఈ రహస్య కెమెరాను అమర్చినట్లుగా సిబ్బంది చెప్పినట్లు బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. మేనేజర్ గదిలోని కంప్యూటర్‌లో దృశ్యాలన్నీ రికార్డు అవుతాయని గుర్తించారు. ఎంతో మంది దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయని లోబో చెప్పారు.

ఎవరైతే ఈ ఘోరం చేశారో ఆ దుర్మార్గుల అమ్మ కూడా ఒక స్త్రీయేనని గుర్తుంచుకోవలన్నారు. ఈ చర్యకు పాల్పడినవారిని వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్త్రీ అభ్యున్నతి మనందరి బాధ్యత అన్నారు. సోషల్ మీడియా ద్వారా మోహన్బాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement