పబ్లిక్ స్మోకింగ్ పై చర్యలేవి? | Sakshi
Sakshi News home page

పబ్లిక్ స్మోకింగ్ పై చర్యలేవి?

Published Sun, Apr 19 2015 8:21 PM

పబ్లిక్ స్మోకింగ్ పై చర్యలేవి?

బహిరంగ ధూమపానాన్ని నిషేధిస్తూ చట్టాలు చేసినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని వాలంటీర్ ఎన్విరాన్‌మెంట్ ఆర్గనైజేషన్(వీఈఓ) ఆవేదన వ్యక్తం చేసింది. బహిరంగధూమపానంపై కఠినంగా వ్యవహించాలని డిమాండ్ చేసింది.

ఆదివారం లక్డీకాపూల్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీఈవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.వీరభధ్రాచారి, జి. మధుసూధన్‌రెడ్డి దూమపాన నిషేద చట్టం అమలును కోరుతూ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. బహిరంగ ధూమపాన నిషేదిత చట్టం గురించి సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు కానీ ధూమపానాన్ని అరికట్టే చర్యలు తీసుకోవడంలేదన్నారు. ప్రభుత్వం తగిన రీతిలో స్పందించేవరకు సంస్థ తరపున పోరాడుతామన్నారు.

Advertisement
Advertisement