Sakshi News home page

చెన్నమనేని పౌరసత్వ రద్దుపై స్టే పొడిగింపు

Published Tue, May 1 2018 1:07 AM

Stay on the abolition of citizenship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ టీఆర్‌ఎస్‌ శాసనసభ్యు డు చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వం చెల్లదన్న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను నిలిపేస్తూ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను జూన్‌ 8 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

చెన్నమనేని పౌరసత్వం చెల్లదని గత ఆగస్టు 31న కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నందున నిర్ణయం వెలువడే వరకూ అమలు నిలిపేయాలని డిసెంబర్‌ 13న హైకోర్టును చెన్నమనేని ఆశ్రయించగా కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

కాగా, తాను తప్పుడు పద్ధతుల్లో పౌర సత్వం పొందినట్లు ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారని చెన్నమనేని తన వ్యాజ్యం లో ఆరోపించారు. దాని ఆధారంగా తనను కేసులో ప్రతివాది చేయాలని శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస్‌ను ప్రతివాదుల జాబితాలో చేర్చాల ని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. ఖర్చుల నిమిత్తం రూ.3 వేలు చెల్లించాలని చెన్నమనేనిని ఆదేశించారు. విచారణ జూన్‌కు వాయిదా పడింది.

Advertisement

What’s your opinion

Advertisement