అవసరం అయితే సుప్రీంకోర్టుకు: హరీశ్ | Sakshi
Sakshi News home page

అవసరం అయితే సుప్రీంకోర్టుకు: హరీశ్

Published Mon, Jun 6 2016 8:42 AM

అవసరం అయితే సుప్రీంకోర్టుకు: హరీశ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులు న్యాయబద్ధమైనవేనని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరిన హరీశ్ రావు బృందం సాయంత్రం కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ కానుంది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కొనసాగకూడదనేదే తమ వాదన అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చలకు పిలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.

తమ వాదనను ఉమాభారతి ముందు ఉంచుతామన్నారు. కృష్ణా బోర్డు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని హరీశ్ వ్యాఖ్యానించారు. న్యాయ పోరాటం కోసం అవసరం అయితే సుప్రీంకోర్టు వెళతామని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పనితీరుపై మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్‌ శాఖ అధికారులు కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement
Advertisement