నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు

Published Tue, Jun 13 2017 1:11 AM

నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు - Sakshi

బీఎడ్, డీఎడ్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులూ పరీక్ష రాయొచ్చు
 
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్‌ రాయవచ్చు. అయితే టెట్‌లో అర్హత సాధించినంత మాత్రాన ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు కాదు, నిర్ణీత నిబంధనలు పూర్తిచేయాల్సి ఉంటుంది. టెట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను టెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు ఈనెల 22 వరకు, ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు 23వ తేదీ వరకు గడువు ఉంటుంది. వచ్చే నెల 23న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటుంది. ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేస్తారు. పేపర్‌–1కు, పేపర్‌–2కు రూ.200 చొప్పున పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. రెండింటికి దరఖాస్తు చేసినా రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను  ్టట్ట్ఛ్ట. ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో పొందవచ్చు. అన్ని జిల్లా కేంద్రాల్లో రాతపరీక్ష ఉంటుంది.
 
45 శాతం మార్కులు ఉండాలి
పేపర్‌–1కు హాజరయ్యేవారు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై (ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం) డీఎడ్‌ పూర్తి చేసి ఉండాలి. అదే 2015 డిసెంబరు 23కంటే ముందు డీఎడ్‌లో చేరినవారు, ఇప్పటికే డీఎడ్‌ పూర్తిచేసిన వారు ఇంటర్‌లో 45 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 40 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. పేపర్‌–2కు హాజరయ్యేవారు డిగ్రీ, బీఎడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. మార్కుల విధానం డీఎడ్‌కు తరహాలోనే వర్తిస్తుంది.
 
హెల్ప్‌లైన్‌ కేంద్రాల వివరాలు టెట్‌ కార్యాలయం: 
9133353370, 9133353371
వెబ్‌సైట్‌ సంబంధ సమస్యలుంటే:
 9133353372, 9133353373
సాంకేతిక సమస్యలు తలెత్తితే:
 9133353374, 9133353375
సీజీజీ హెల్ప్‌డెస్క్‌ నంబర్లు: 
9133353376, 9133353377
డిగ్రీ డీఎడ్‌ వారికి అవకాశం కల్పించాలి
డిగ్రీతోపాటు డీఎడ్‌ ఉన్న వారికి టెట్‌ రాసే అవకాశం కల్పించాలని పాఠశాల విద్య కమిషనర్‌ కిషన్‌కు డీఎడ్, బీఎడ్‌ విద్యా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందించారు. కాగా టెట్‌లో ఓసీ (జనరల్‌) అభ్యర్థులకు అర్హత మార్కులను తగ్గించాలని ఓసీ విద్యార్థి సంఘం డిమాండ్‌ చేసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement