ఇక రోజూ డిజిటల్‌ తరగతులు | Sakshi
Sakshi News home page

ఇక రోజూ డిజిటల్‌ తరగతులు

Published Sun, Feb 12 2017 3:37 AM

The daily digital classes

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజూ డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్‌ కేలండర్‌లో నిబంధనలు పొందుపర్చింది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో ఒక తరగతికి ఉదయం, మరో తరగతికి మధ్యాహ్నం డిజిటల్‌ పద్ధతిలో బోధన నిర్వహిస్తున్నారు.

విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే ఒక్కో తరగతికి ఒక రోజు చొప్పున పూర్తిగా డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తారు. 6–10వ తరగతి విద్యార్థులకు వారంలో కనిష్టంగా 30 తరగతులు ఇలా బోధన జరగాల్సిందిగా 2017–18 విద్యా కేలండర్‌లో రూపొందించింది. మార్చి 21న విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో బోధన పక్కాగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
Advertisement