కొత్త చట్టం పరిధిలోకి మెట్రో | Sakshi
Sakshi News home page

కొత్త చట్టం పరిధిలోకి మెట్రో

Published Wed, Sep 24 2014 1:37 AM

కొత్త చట్టం పరిధిలోకి మెట్రో - Sakshi

ఇక చురుగ్గా పనులు
నూతన చ ట్టం ప్రకారమే మార్పులు


సాక్షి, సిటీబ్యూరో: నగర మెట్రో ప్రాజెక్టుకు రైల్వే శాఖ నుంచి ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ ప్రాజెక్టును ట్రామ్‌వే యాక్ట్ (రైల్వే శాఖకు సంబంధించిన) నుంచి మినహాయించి సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకు చికాకులు తప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో రైలు ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో వివిధ విభాగాల నుంచి అందాల్సిన భద్రత, నిర్వహణపరమైన అనుమతులకు మార్గం సుగమం కానుంది. పనులు వేగవంతం కానున్నాయి.
 
కొత్త చట్టం ప్రకారమే...
మెట్రో ప్రాజెక్టును సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి మార్చడంతో ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా,నాగోల్-శిల్పారామం మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ మార్గంలో అలైన్‌మెంట్ (మార్గం)లో మార్పులు చేర్పులు సైతం కొత్త చ ట్టానికి లోబడే చేయాలి. ఒకవేళ మెట్రో మార్గాన్ని(అలైన్‌మెంట్) మార్చాల్సిన పక్షంలో గెజిట్‌లో నోటిఫై చేయాలి. అలైన్‌మెంట్ మార్పు లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఈ చట్టం కింద కేంద్రానికి తాజా అలైన్‌మెం ట్ ప్రతులను పంపి, అనుమతి పొందాలి.

Advertisement
Advertisement