టుడే న్యూస్ అప్ డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్ డేట్స్

Published Mon, Dec 12 2016 8:29 AM

today news updates

మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా సోమవారం ముస్లిం సోదరులు ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని జరుపుకోనున్నారు.

వార్దా అతి తీవ్ర తుపానుగా కొనసాగుతూ పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న ఈ అతి తీవ్ర తుపాను పశ్చిమ దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి ఇది తూర్పు ఈశాన్య దిశగా చెన్నైకి 300, నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేపీ తుపానుగా బలహీనపడుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల తీరాల మధ్య చెన్నైకి సమీపంలో సోమవారం మధ్యాహ్నానికి తీరాన్ని దాటనుంది.

పొగమంచు కారణంగా రైళ్లకు అంతరాయం కలుగుతోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రావాల్సిన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆలస్యంగా రావడంతో సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సిన ఈ రైలు సమయాన్ని మార్చారు. ఉదయం 6.25కు నాంపల్లి నుంచి బయల్దేరాల్సిన తెలంగాణ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.55కు బయలుదేరనుంది.

మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి ఆయన పార్టీలో చేరనున్నారు.

చిత్తూరు: నేడు తమిళ కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలై అరుణాచలేశ్వరుడి ఆలయంలో మహా జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.


చిత్తూరు: తుపాన్ ప్రభావంతో జిల్లాలో భారీగా గాలులు వీస్తున్నాయి. నేడు కలెక్టరేట్‌లో తుపాన్‌పై హోం మంత్రి చినరాజప్ప అధికారులతో సమావేశం కానున్నారు.

హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు టీటీడీఎల్పీ సమావేశం

తుర్పుగోదావరి జిల్లా : దివీస్ నిర్మాణ ప్రాంతంలో నిజనిర్దారణ కమిటీ పర్యటన

జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. కెనడాను 4-0తో, ఇంగ్లండ్‌ను 5-3తో ఓడించిన భారత్ ఇప్పటికే పూల్ ‘డి’ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్తు సాధించింది. తాజాగా సోమవారం జరగనున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను కంగుతినిపించి పూల్ టాపర్‌గా క్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగాలని భావిస్తోంది.

Advertisement
Advertisement