జూనియర్ ఎన్టీఆర్ కారుకు ట్రాఫిక్ చలానా | Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్ కారుకు ట్రాఫిక్ చలానా

Published Thu, Apr 7 2016 7:57 AM

జూనియర్ ఎన్టీఆర్ కారుకు ట్రాఫిక్ చలానా - Sakshi

హైదరాబాద్: సినీహీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. ఆయన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉందని రూ.700 వసూలు చేశారు. అమీర్‌పేట సార థి స్టూడియోలో జనతా గ్యారేజీ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు రేంజ్‌ రోవర్ కారు (ఏపీ37 ఏఎక్స్ 9999)లో ఎన్టీఆర్ వెళ్తుండగా, ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఎన్టీఆర్ డ్రైవర్ ఈశ్వరయ్య కారు దిగి అన్ని ధ్రువపత్రాలను చూపించాడు.

అయితే నిబంధనలకు వ్యతిరేకంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు చలానా విధించారు. అయితే కారులో ఎన్టీఆర్ ఉన్నారని, స్టూడియోలో దించి వచ్చి చెల్లిస్తానని డ్రైవర్ చెప్పగా, అలా కుదరదని చలానా చెల్లించిన తర్వాతే వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని డ్రైవర్ చలానా చెల్లించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 

Advertisement
Advertisement