మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి | Sakshi
Sakshi News home page

మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి

Published Mon, Aug 31 2015 3:38 AM

మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి - Sakshi

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్‌గా పిల్లి సుభాష్‌చంద్రబోస్ నియమితులయ్యారు. ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు, ముఖ్యులతో చర్చించిన అనంతరం జగన్ ఈ నియామకాలను వెల్లడించారు. మండలిలో వైఎస్సార్‌సీపీకి ఏడుగురు ఎమ్మెల్సీల బలం ఉంది.

విప్‌గా పిల్లి సుభాష్ చంద్రబోస్

ఆదిరెడ్డి అప్పారావు, కోలగ ట్ల వీరభద్రస్వామి, డీసీ గోవిందరెడ్డి, సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు మండలిలో పార్టీ సభ్యులుగా ఉన్నారు. మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా ఎన్నికైన ఉమ్మారెడ్డి ఒకసారి ఎమ్మెల్యే, మూడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు.

Advertisement
Advertisement