ఆరుగురు ఉగ్రవాదులు హతం | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఉగ్రవాదులు హతం

Published Sun, Apr 2 2017 3:51 PM

6 terrorists killed as security attack in Egypt

కైరో: భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈజిప్టులోని ఉత్తర సినాయిలో నగరంలో రెండు బంకర్లలో తీవ్రవాదులు తిష్ట వేసుకొని ఉన్నారనే సమాచారంతో ఆదివారం దాడులు నిర్వహించిన పోలీసులు ఆరుగురు తీవ్రవాదులను హతమార్చారు. ఈజిప్టు ఆర్మీ సహకారంతో పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో 29 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన తీవ్రవాదులు తక్ఫిరి వర్గానికి చెందిన ఉగ్రవాదులని అధికారులు తెలిపారు. గత ఆరేళ్లలో ఈ నగరంలో పలుమార్లు ఉగ్రదాడులు జరిగాయి.

Advertisement
Advertisement