‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు | Sakshi
Sakshi News home page

‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు

Published Sat, Feb 28 2015 3:38 AM

‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు

మరుగుజ్జు గ్రహం సీరీజ్‌పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ఉద్గారాలు కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే ఇంకా స్పష్టంగా కనిపించేంత వరకు కచ్చితంగా చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. ఈ డాన్ వ్యోమనౌక సీరీజ్ కక్ష్యలోకి మార్చి 6న ప్రవేశించనుంది. ఆ తర్వాత ఈ ప్రకాశవంతమైన ప్రదేశాన్ని స్పష్టంగా చూసి దాని గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2012లో సీరీజ్ నుంచి విడుదలవుతున్న నీటి ఆవిరిని కనుగొన్నారు. గ్రహ ఉపరితలంపై నీటిని కలిగి ఉన్న ఖనిజాలు ఉండొచ్చని వారు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement