తంతే బుట్టలో పడాల్సిందే! | Sakshi
Sakshi News home page

తంతే బుట్టలో పడాల్సిందే!

Published Fri, Jun 30 2017 6:45 PM

తంతే బుట్టలో పడాల్సిందే! - Sakshi

జెరూసలెం: పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా ఇజ్రాయెల్‌కు చెందిన బుడతడు పుట్టగానే ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అయినట్లున్నాడు. మూడేళ్ల మతన్‌ షావులొవ్‌ అద్భుత ఫుట్‌బాల్‌ క్రీడా విన్యాసాలను చూస్తే ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారులైన పోర్చుగీస్‌కు చెందిన లియోనెల్‌ మెస్సీ, ఆర్జెంటీనాకు చెందిన క్రిస్టియానో రొనాల్డో కూడా అబ్బురపడి ముక్కున వేలేసుకుంటారు. ఇప్పటికే మతన్‌ విన్యాసాల వీడియో వైరల్‌ అయినందున వారు దాన్ని చూసి ముక్కున వేలేసుకొనె ఉంటారు.

ఫుట్‌బాల్‌ మైదానంలోకి వెళ్లి ఆడే వయస్సు కాదు కాబట్టి చిన్నారి మతన్‌ ఇంటా, బయట గోల్స్‌ చేస్తున్నాడు. డస్ట్‌బిన్‌లను, బాస్కెట్‌ బాల్‌ రింగులను ఉపయోగించుకొని గోల్స్‌ ఎక్కువగా చేస్తున్నాడు. షాపింగ్‌ మాల్స్‌లో షాపర్స్‌ కాళ్ల సంధుల్లో నుంచి బంతిని పాస్‌చేస్తూ ‘వావ్‌’  అనిపిస్తున్నాడు. ముఖ్యంగా వెల్లకిలా పడుకొని వెనుకనున్న డస్ట్‌బిన్‌లోకి రివర్స్‌ గోల్‌ చేయడం పలువురిని ఆకర్షిస్తోంది.

Advertisement
Advertisement