పుషప్‌.. పుల్‌అప్స్‌తో ఆయువు | Sakshi
Sakshi News home page

పుషప్‌.. పుల్‌అప్స్‌తో ఆయువు

Published Wed, Nov 8 2017 3:08 AM

long time live with pullups - Sakshi

వ్యాయామం అంటే కొందరికి నడక.. ఇంకొందరికి జాగింగ్, రన్నింగ్‌.. మరికొందరికి పుషప్స్, పుల్‌అప్స్‌.. మరి ఏ వ్యాయామం చేసినవారు ఎక్కువ కాలం బతికే అవకాశముంది? ఆసక్తికరమైన ప్రశ్న కదూ.. సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అంచనాలు నిజమైతే.. పుషప్స్, పుల్‌అప్స్‌ చేసే వారు కొంచెం ఎక్కువ కాలం బతికే అవకాశముంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లలో దాదాపు 80 వేల మందిపై జరిగిన సర్వేలో సేకరించిన వివరాలను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్లు ప్రొఫెసర్‌ ఎమ్మాన్యుయేల్‌ స్టామాటాకిస్‌ తెలిపారు.

వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి, చదువు వంటి కొన్ని అంశాల ప్రభావాన్ని తొలగించి చూడగా కండరాల పటుత్వం కోసం వ్యాయామం చేసే వారు అకాల మృత్యువు పాలయ్యే అవకాశాలు 23 శాతం తక్కువని, కేన్సర్‌ సంబంధిత మరణం సంభవించేందుకు ఉన్న అవకాశం 31 శాతం వరకు తక్కువని స్పష్టమైనట్లు వివరించారు. 

Advertisement
Advertisement