ఆడ, మగ.. కొత్తగా ‘జీ’ | Sakshi
Sakshi News home page

ఆడ, మగ.. కొత్తగా ‘జీ’

Published Mon, Jul 18 2016 5:55 AM

ఆడ, మగ.. కొత్తగా ‘జీ’

లండన్ : ట్రాన్స్‌జెండర్ పిల్లలను బ్రిటన్ బోర్డింగ్ స్కూల్ టీచర్లు ఇకపై ‘జీ’  (ZIE)గా గుర్తించనున్నారు. వీరి కోసం అతడు లేదా ఆమె అని కాకుండా ‘జీ’ అనే పదాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు యూకే బోర్డింగ్ స్కూల్స్ అసోసియేషన్.. తమ టీచర్లకు సూచించిందని ‘ది సండే టెలిగ్రాఫ్’ తెలిపింది.

తమను అతడు లేదా ఆమె అని గుర్తించవద్దని ట్రాన్స్‌జెండర్ పిల్లలైన విద్యార్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీరి కోసం కొత్త భాషను కనుక్కోవాలని సిబ్బంది చెప్పారు. జీ అంటే లింగ భేదం లేని సర్వనామం. యూరప్, బ్రిటిష్ టీచర్లందరూ ఈ పదాన్ని వినియోగించవచ్చని కొత్త మార్గదర్శకాల రచయిత ఎల్లీ బార్న్స్ తెలిపారు.

Advertisement
Advertisement