ఇంతకంటే దారుణాన్ని వినలేదు | Sakshi
Sakshi News home page

ఇంతకంటే దారుణాన్ని వినలేదు

Published Wed, Jul 20 2016 7:24 PM

ఇంతకంటే దారుణాన్ని వినలేదు - Sakshi

ఈ బెంచ్పై మూడున్నరేళ్లు ఉన్నాను.. ఇన్ని రోజుల్లో ఈ కోర్టుకు వచ్చిన కేసుల్లో అత్యంత దారుణమైన కేసు ఇదే. ఓ తల్లి చేసిన దారుణం గురించి హామిల్టన్ కౌంటీ కోర్టు జడ్జి లెస్లీ ఘిజ్ చేసిన వ్యాఖ్యలివి. నిందితురాలు కొర్కొరన్కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంత భారీ శిక్ష పడటానికి ఆమె చేసిన నేరం ఏంటంటే..

కొర్కొరన్ డ‍్రగ్స్కు బానిసైంది. హెరాయిన్ తీసుకోకుంటే రోజు గడిచేదికాదు. అయితే డ్రగ్స్ కొనేందుకు ఆమె వద్ద సరిపడా డబ్బు ఉండేదికాదు. అలాగని డ్రగ్స్ అలవాటు మానులేకపోయింది. రెండేళ్ల క్రితం కొర్కొరన్ డబ్బుల కోసం తన 11 ఏళ్ల కుమార్తెను డ్రగ్  డీలర్ వద్ద కుదువ పెట్టి అప్పు తీసుకుంది. ఇంతకంటే దారుణమేంటంటే తన కూతురును అత్యాచారం చేసేందుకు డ్రగ్ డీలర్కు అనుమతిచ్చింది. ఆ నీచుడు అభంశుభం తెలియని బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయిని హింసించి తన వాంఛలు తీర్చుకునేవాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలను వీడియోలు తీసేవాడు. కొర్కొరన్ తన కూతురును ఇంతటితో వదిలిపెట్టలేదు. కుమార్తెకూ బలవంతంగా డ్రగ్స్ ఇచ్చేది. పాపం ఆ చిన్నారి ప్రతిసారి వాంతి చేసుకునేంది. ఐదు నెలల పాటు ఆ అమ్మాయి చిత్రహింసలు అనుభవించింది.

ఈ విషయం వెలుగు చూడటంతో కొర్కొరన్, డ్రగ్ డీలర్ షాండెల్ విల్లింగామ్పై కేసు నమోదు చేశారు. న్యాయస్థానం వీరిద్దరినీ దోషులుగా ప్రకటించింది. తప్పు చేసినందుకు కొర్కొరన్లో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. ఆమెకు కఠిన కారాగార శిక్ష వేయగా, షాండెల్కు శిక్ష ఖరారు చేయాల్సివుంది. బాధితురాలు ప్రస్తుతం తన తండ్రి, సవతి తల్లి దగ్గర ఉంటోంది. విషాదం తాలుకు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement