Sakshi News home page

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మూడోసారి..

Published Wed, Aug 30 2017 4:49 PM

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మూడోసారి.. - Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మూడోసారి తండ్రి అయ్యారన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కిమ్‌ భార్య రి–సోల్‌–జు ఈ ఏడాది ఫిబ్రవరిలో బిడ్డకు జన్మనిచ్చారని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హప్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. జపాన్‌ మీదుగా మంగళవారం ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో ఈ వార్త వెలువడడం గమనార్హం. గతేడాదిగా రి–సోల్‌ బయట ప్రపంచానికి కనిపించకపోవటంతో ఆమె గర్భవతి అన్న వార్తలు వచ్చాయి.

కిమ్‌ దంపతులు 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి 2010లో మొదటి బిడ్డ, 2013లో పాప పుట్టింది. కిమ్‌ దేశాధ్యక్షుడైనప్పటికీ అతని పుట్టిన రోజు, పెళ్లి రోజు గురించి కచ్చితమైన సమాచారం ప్రపంచానికి తెలియదు. రెండో బిడ్డ విషయం కిమ్‌ అభిమాన బాస్కెట్‌ బాల్‌ అటగాడు డెన్నిస్‌ రాడ్‌మెన్‌ బయటకు చెప్పినప్పుడు మాత్రమే ప్రపంచానికి తెలిసింది.

రి–సోల్‌–జు సామాన్య కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి విద్యావంతుడు కాగా, తల్లి డాక్టర్‌. అయితే రి–సోల్‌–జుకు జన్మించింది పాప, మగబిడ్డ అనేది వెల్లడి కాలేదు. ఆమె మొదటి బిడ్డ కూడా ఆడో, మగో బయట ప్రపంచానికి తెలియదు. రి–సోల్‌–జు రెండోసారి ప్రసవించింది మాత్రం ఆడబిడ్డ అని మాత్రమే ప్రపంచానికి తెలిసింది. కిమ్‌కు మొదట కొడుకు పుట్టాడని ప్రచారం జరుగుతోంది.

Advertisement

What’s your opinion

Advertisement