యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్‌ | Sakshi
Sakshi News home page

యుద్ధ క్షిపణిని పరీక్షించిన పాక్‌

Published Mon, Jan 9 2017 9:07 PM

Pakistan Successfully Test-Fires Submarine-Launched Babur Missile

ఇస్లామాబాద్‌: జలాంతర్గామి మీద నుంచి ప్రయోగించే అణు యుద్ధ క్షిపణి బాబర్‌-3ని పాకిస్థాన్‌ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. సోమవారం చేసిన ఈ పరీక్ష విజయవంతం అయినట్లు పాక్‌ మీడియా తెలిపింది. అణ్వస్త్రాలను ఈ క్షిపణి దాదాపు 450కిలో మీటర్లు మోసుకెళ్లగలదు. హిందూ మహాసముద్రంలో గుర్తు తెలియన ప్రాంతంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం.

పాక్‌ వద్ద అత్యంత శక్తిమంతమైన వార్‌హెడ్‌లలో ఇదే రెండో అతిపెద్దది అని ఆ దేశ మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ’బాబర్‌-3ని నీటి అడుగు భాగం నుంచి జలాంతర్గామిపై ఏర్పాటు చేసిన మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రయోగించాం' అని అక్కడి మీడియా, పబ్లిక్‌ రిలేషన్‌ సంస్థ వెల్లడించింది. అంతకుముందు బాబర్‌ 2ను పాక్‌ డిసెంబర్‌లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసింది. బాబర్‌ 3 యుద్ధ క్షిపణిని భారత్‌లోని బ్రహ్మోస్‌ క్షిపణికి పోటీగా చెబుతున్నారు.

Advertisement
Advertisement