అనుకరించలేరు.. | Sakshi
Sakshi News home page

అనుకరించలేరు..

Published Sun, May 8 2016 1:41 AM

అనుకరించలేరు..

మెల్‌బోర్న్: పుట్టిన కొన్ని వారాల వ్యవధిలోనే చేతి సంజ్ఞలు, ముఖ కవళికలు, శబ్దాలను పిల్లలు అనుకరిస్తారనే పాత పరిశోధన తప్పు అని, నవజాతశిశువులు పెద్దలను అనుకరించలేరని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిని కొన్ని నెలలు పరీక్షించిన  శాస్త్రవేత్తలు అనుకరణపై ఎలాంటి రుజువులు లభించలేదన్నారు. ‘శిశువులు పెద్దలను అనుకరించలేరని 1980, 1990 దశాబ్దాల నాటిపరిశోధనల్లోనే వెల్లడైంది. అయితే పిల్లలు అనుకరిస్తారని  కొందరంటున్నారు. గత పరిశోధనలను పరిశీలిస్తే.. పిల్లల స్పందనను గమనించేందుకు పరిశోధకులు తక్కువ హావభావాలను చూపేవాళ్లు.

ఉదాహరణకు ఒక వ్యక్తి తన నాలుకను బయటకు తీసి చూపిస్తే.. పిల్లలు కూడా అలానే చేస్తారు. పిల్లలు నిజంగా అనుకరిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు.. ఇంతకుమించిన హావభావాలు కాని, ముఖకవళికలు కాని చేసి పరీక్షించలేదు’ అని క్వీన్స్‌లాండ్ వర్సిటీ పరిశోధకుడు వర్జీనియా స్లాటర్ తెలిపారు. ‘106 మంది పిల్లలపై అధ్యయనం చేశాం. 1, 2, 6, 9 నెలల్లో వారి స్పందనను నమోదు చేసుకున్నాం. పరిశీలనలో పిల్లలు దేన్నీ అనుకరించలేదని తేలింది’ అని వెల్లడించారు. ..

Advertisement
Advertisement