స్మార్ట్ ఫోన్ డేటా తిరిగి రాబట్టే సాధనం | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్ డేటా తిరిగి రాబట్టే సాధనం

Published Sat, Aug 13 2016 8:28 PM

Removed date can be recovered to Samrt phone data recover Tool

వాషింగ్టన్: స్మార్ట్ ఫోన్‌లోని సమాచారాన్ని తిరిగి రాబట్టే సరికొత్త కిటుకును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తద్వారా స్మార్ట్‌ఫోన్ నేరాల దర్యాప్తు మరింత సులువు కానుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో అందరూ స్మార్ట్‌ఫోన్లలో తమ సమాచారాన్ని దాచుకుంటున్నారు. అనాదిగా జరుగుతున్న ఈ తరహా నేరాల్లో వీటిని ఆధారాలుగా సేకరించడం కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెట్రోస్కోపీగా పిలిచే సరికొత్త సాధనం ఇందుకు దోహదపడనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రెట్రోస్కోపీ.. స్మార్ట్‌ఫోన్ హార్డ్ డిస్క్‌పై దృష్టి పెడుతుందని, ఫోన్ స్విచ్‌ఆఫ్ ఆయిపోయినప్పటికీ ఈ కిటుకు ద్వారా డివైస్ ర్యామ్ అస్థిర సామర్థ్యాన్ని అలాగే పట్టి ఉంచుతుందని పేర్కొంటున్నారు. రెట్రోస్కోపీ ద్వారా సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా అన్ని యాప్స్ నుంచి అత్యంత తాజా సమాచారమైన అస్థిర సామర్థ్యాన్ని అందజేస్తుందని తాము వాదిస్తామని పుర్డూ యూనివర్సిటీ ప్రొఫెసర్, పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న డొంగ్యాన్ క్చ్యూ తెలిపారు.

Advertisement
Advertisement