Sakshi News home page

ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లపై 30 వేల కోట్ల ప్రతిస్పందనలు

Published Sun, Feb 26 2017 2:29 AM

ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లపై 30 వేల కోట్ల ప్రతిస్పందనలు - Sakshi

శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లపై రికార్డు స్థాయిలో ప్రతిస్పందనలు వచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఒక సంవత్సర కాలంలో సుమారు 30 వేల కోట్ల ప్రతిస్పందనలు వచ్చాయని, వీటిల్లో సగానికిపైగా ‘ప్రేమ’ అనే అంశానికి సంబంధించి నమోదైనట్లు పేర్కొంది. ఫేస్‌బుక్‌లో మొత్తం 179 కోట్ల మంది వినియోగదారులకు ఖాతాలు ఉన్నాయి.

ఫేస్‌బుక్‌ కంపెనీ ‘ప్రేమ’, ‘ఆహా’, ‘వావ్‌’, ‘విచారం’, ‘కోపం’ వంటి భావోద్వేగ పదాలను ‘లైక్‌’ బటన్  ఆధారంగా ఫిబ్రవరి 24వ తేదీన విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది క్రిస్మస్‌ రోజున ప్రేమ అనే పదానికి సంబంధించిన ప్రతిస్పందనలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ప్రతిస్పందనలను వ్యక్తం చేసినవారిలో మెక్సికో దేశస్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చిలీ, సురినామే, గ్రీస్‌లు ఉన్నాయి. అమెరికా 8వ స్థానంలో ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement