సెల్ఫీ వ్యామోహం ఉన్నవారికి 'టీ రెక్స్ హ్యాండ్' | Sakshi
Sakshi News home page

సెల్ఫీ వ్యామోహం ఉన్నవారికి 'టీ రెక్స్ హ్యాండ్'

Published Sat, Mar 26 2016 1:46 PM

సెల్ఫీ వ్యామోహం ఉన్నవారికి  'టీ రెక్స్ హ్యాండ్'

సెల్ఫీల వ్యామోహం ఉన్నవారికి ఇదో మంచి అవకాశం. అనేక వినూత్న భంగిమల్లో ఫొటోలు తీసుకోవాలని మనసు పడేవారికి, ఎప్పుడూ విభిన్నంగా కనిపించాలని ఇష్టపడేవారికి లేటెస్ట్ ట్రెండ్‌గా టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) హ్యాండ్స్ పోజును లండన్ కు చెందిన ఓ బ్యూటీ బ్లాగర్ పరిచయం చేసింది. చేతి వేళ్లను ముఖానికి దగ్గరగా అనేక భంగిమల్లో ఉంచుతూ ఫొటోలు తీసుకొని ఆ అందాలను మీరే స్వయంగా చూసుకోవాలని సలహా ఇస్తోంది.

సెల్ఫీల ధోరణి ఎక్కువైన నేటికాలం జనానికి కొత్త రకం సెల్ఫీ స్టైల్ ను పరచయం చేసింది.. లండన్ కు చెందిన బ్యూటీ బ్లాగర్, ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ హుడా కట్టమ్. థైబ్రోస్, డక్ ఫేస్ లాంటి విభిన్న చిత్రాలను తీసుకోవడం సైతం పాత పద్ధతిగా మారిన నేపథ్యంలో... వినూత్నంగా టీ రెక్స్  ప్రయోగాన్ని ఆమె తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది.  మీరు సెల్ఫీ తీసుకునే సమయంలో  రెండు చేతులను ఉపయోగించి, ముఖానికి దగ్గరగా ఉంచుకొని  ఫొటో తీసుకుంటే టీ రెక్స్ ప్రభావం మీకే తెలుస్తుందంటూ ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించిన సదరు మహిళ వివరించింది. తాను స్వయంగా ఆ  అనుభవాన్ని ఆస్వాదించినట్లు కట్టమ్ ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది.

ఓ కొత్త పోజులో మీరు కనిపించాలనుకున్నపుడు కెమెరా పట్టుకున్న మీ చేతులను కళాత్మకంగా ముడుస్తూ.. ముఖం దగ్గర, గడ్డం మీద, జుట్టు మీద ఉంచి చూడమంటోంది. మీరు చేతిని, చేతి వేళ్లను కదులుస్తూ, ముఖంలోని ఒక్కో భాగంపై పెడుతూ టి రెక్స్ ను ఉపయోగించి చూస్తే సెల్ఫీ మజా ఏమిటో తెలుస్తుందంటోంది. ముఖ్యంగా వేళ్లను నుదుటిపై ఉంచినపుడు టి రెక్స్ అద్భుతంగా కనిపిస్తుందని, అలాగే ముఖంలోని ప్రతి భాగం విభన్నంగా కనిపిస్తుందని కట్టమ్ చెప్తోంది. టి రెక్స్ థెరోపాడ్ డైనోసార్ హ్యాండ్ పద్ధతిలో తీసుకున్న సెల్ఫీలు సెలబ్రిటీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement