పనులు చకచకా.. ఇల్లు మిలమిలా | Sakshi
Sakshi News home page

పనులు చకచకా.. ఇల్లు మిలమిలా

Published Mon, Jul 18 2016 3:22 AM

పనులు చకచకా.. ఇల్లు మిలమిలా - Sakshi

అసలే ఉరుకులు పరుగుల జీవితంలో ఇంటిని చక్కబెట్టుకోవడం కాస్త కష్టమే.. ఇక భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతేనూ.. పొద్దంతా ఆఫీస్‌లో పనిచేసి ఇంటికి వచ్చి మళ్లీ ఇంటి పని, వంట పని చేసుకోవాలంటే ఎంతైనా కాస్త ఇబ్బందే. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు త్వరలోనే ఇళ్లల్లోకి రాబోతోంది ఓ సరికొత్త రోబో..! ‘ఓపెన్ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ )’ అనే కంపెనీ రూపొందిస్తున్న ఈ రోబో.. ఇంటి పనులు చకచకా చేసేస్తుంది. ఇల్లు ఊడవడం దగ్గరి నుంచి ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులను చక్కగా సర్దడం వంటి అనేక పనులు చేసిపెడుతుంది.

సూటిగా చెప్పాలంటే రోబో పనిమనిషి అన్నమాట. అంతేకాదు తమకు అర్థం కాని పనులు చెబితే యజమానిని అడిగి మరీ అనుమానాలను నివృత్తి చేసుకుంటుందట. ఎలన్‌మస్క్, సామ్ అల్ట్‌మన్ ఇద్దరూ కలసి ఈ ‘ఏఐ’ని గతేడాది ఆవిష్కరించారు. లండన్‌లో జరిపిన ఓ సర్వే ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరు రోబోలతో ఇంటి పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నారని తేలింది.

Advertisement
Advertisement