Sakshi News home page

ఓవియకు బిగ్‌బాస్‌ క్రేజ్‌

Published Wed, Jul 26 2017 1:42 AM

ఓవియకు బిగ్‌బాస్‌ క్రేజ్‌ - Sakshi

తమిళసినిమా: బిగ్‌బాస్‌తో నటి ఓవియకు పిచ్చ క్రేజ్‌ వచ్చేసింది. విశ్వనటుడు కమలహాసన్‌ తొలిసారిగా బుల్లితెరపై రంగప్రవేశం చేసి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షోలో 14 మంది సినీ కళాకారులు పోటీకి దిగిన విషయం తెలిసిందే. అందులో నటి ఓవియకు మాత్రం క్రేజ్‌ విపరీతంగా వచ్చేసింది. ఆమె ప్రవర్తనను చాలా మంది లైక్‌ చేస్తున్నారు.

శింబు లాంటి నటులు కూడా ఓవియకు మద్దతు తెలుపుతున్నారంటే ఆమె ఎంతగా పేరు సంపాదించుకుంటుందో చూడండి.  దీంతో ఇప్పటి వరకూ పెద్దగా అవకాశాలు లేని ఓవియకిప్పుడు అవి వరుస కడుతున్నాయి. ఇప్పటికే మెట్రో చిత్రం ఫేమ్‌ శిరీష్‌ తన తాజా చిత్రంలో ఓవియకు కథానాయకి అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా తాజాగా యామిరుక్క భయమే చిత్ర పార్టు–2లోనూ ఓవియను ఎంపిక చేసుకున్నారు. యామిరుక్క భయమే చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఓవియకు దాని సీక్వెల్‌లో ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఇవ్వనున్నట్లు సమాచారం.

అదే విధంగా విజయ్‌సేతుపతితో జత కట్టే అవకాశాన్ని ఓవియ కొట్టేసింది. విజయ్‌సేతుపతితో నడువుల కొంచెం పక్కత్తు కానోమ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన బాలాజీ దరణీధరన్‌ తాజాగా ఆయనతో ఒక చిత్రం చేయనున్నారు. ఇందులో నటి ఓవియను నాయకిగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అయితే తను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం వల్ల ఈ అవకాశం చేజారినట్లు తాజా సమాచారం. అయితే ఈ భామ షో నుంచి బయటకు రాగానే మరి కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. ఇదంతా బిగ్‌బాస్‌ క్రేజేనని చెప్పక తప్పదు.

Advertisement

What’s your opinion

Advertisement