అల్లువారి బుల్లోడు ..ఈసారి శాంటాక్లాజ్ | Sakshi
Sakshi News home page

అల్లువారి బుల్లోడు ..ఈసారి శాంటాక్లాజ్

Published Thu, Dec 25 2014 12:31 PM

అల్లువారి బుల్లోడు ..ఈసారి శాంటాక్లాజ్ - Sakshi

సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్తో వెండితెరపై 'నాన్న' మెరుస్తుంటే...కొడుకు మాత్రం తక్కువ తిన్నాడా? సందర్భాన్ని బట్టి ఆయా గెటప్లతో అదరగొడుతున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా బుడతడు అంటే... అదేనండి  అల్లువారి బుల్లోడు తాజాగా శాంటాక్లాజ్ వేషంలో దర్శమనిచ్చాడు.

ఇటీవల  బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ గెటప్లో అదరగొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్...ఈసారి రెడ్ అండ్ వైట్ కలర్ దుస్తులలో శాంటాక్లాజ్ డ్రస్తో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా బన్నీ తన కుమారుడిని శాంటాక్లాజ్గా ముస్తాబు చేసి ఫోటో తీశాడు. ఈ ఫోటోను తన ఫేస్బుక్లో అప్ చేయటం... చిన్నోడికి లైక్ల మీద లైక్లు వస్తున్నాయి. మరి అల్లువారి మనవడా...మజాకానా.

Advertisement
Advertisement