అభిమాని వైద్యానికి బిగ్ బీ సహాయం | Sakshi
Sakshi News home page

అభిమాని వైద్యానికి బిగ్ బీ సహాయం

Published Sun, Nov 16 2014 11:51 AM

అభిమాని వైద్యానికి బిగ్ బీ సహాయం

కోల్ కతా: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరును తన శరీరమంతా పచ్చబొట్టు పొడిపించుకుని అభిమానాన్ని చాటుకున్న ఓ అభిమానికి బీగ్ బీ అండగా నిలువనున్నారు. 
 
'ఒంటిపై అమితాబ్ అంటూ పేరును రాసుకున్న వ్యక్తి ఏదో సమస్య ఉందనిపించింది. అతని వైద్యానికి కొంత సహాయం అవసరముందని గ్రహించాను. అభిమానులు పోటెత్తడంతో భారీ సెక్యూరిటిని ఏర్పాటు చేశారు. ఆ జనం మధ్య నుంచి నా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. అతని ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు నాకు అందాయి. అతనికి సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాను' అని బిగ్ బీ తన బ్లాగ్ లో వెల్లడించారు. 
 
కోల్ కోతాలో జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

Advertisement
Advertisement