‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

14 Sep, 2019 19:06 IST|Sakshi

బిగ్‌బాస్‌లో ఎనిమిదో వారం సందడిగానే గడిచింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఒకెత్తు అయితే.. దానిని సరిగా అర్థం చేసుకోకుండా ఇంటి సభ్యులు ఆడిన విధానం మరో ఎత్తు. ఈ టాస్క్‌లో జరిగిన పరిణామాలు.. పునర్నవి ప్రవర్తించిన తీరు... ఆ పై టాస్క్‌ను నిందించడం.. టాస్క్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ను ఎదిరించడం.. లాంటివి చాలానే జరిగాయి. అయితే వీటన్నంటిపై నాగార్జున సీరియస్‌ అయినట్లు కనిపిస్తోంది.

బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను బుల్‌షిట్‌ అని అంటావా? అంటూ పునర్నవిపై నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని శ్రీముఖిపై సీరియస్‌ అయ్యాడు. అంతేకాకుండా శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌వి కాదు.. ఈ హౌస్‌కు బిగ్‌బాస్‌ బాస్‌ అంటూ ఘాటుగా స్పందించాడు. ఇక నాగ్‌ జోరు చూస్తుంటే.. హౌస్‌మేట్స్‌ అందరికీ తడిసిపోయేట్టు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌ మొత్తం సీరియస్‌గా సాగుతుందా? లేదా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉందా? అన్నది కొద్దిగంటల్లో తేలనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

మహేష్‌ను ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?

బిగ్‌బాస్‌.. శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?