‘సినీ పరిశ్రమనే వేలెత్తి చూపడం సరికాదు’ | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌, కేటీఆర్‌ చర్యలను అభినందిస్తున్నా’

Published Thu, Jul 20 2017 3:39 PM

‘సినీ పరిశ్రమనే వేలెత్తి చూపడం సరికాదు’ - Sakshi

నెల్లూరు : తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ మాఫియా వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ... డ్రగ్స్‌ సంస్కృతి చిత్ర పరిశ్రమతో పాటు ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే కేవలం సినీ పరిశ్రమనే వేలెత్తి చూపడం సరికాదని అశ్వినీదత్‌ సూచించారు.

డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపేలా  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన అభినందించారు. కాగా డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌కు చెందిన 12మందికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నిన్న (బుధవారం) విచారణకు హాజరు కాగా, ఇవాళ కెమెరామెన్‌ శ్యాం కె నాయుడు సిట్‌ ఎదుట హాజరు అయ్యారు.

Advertisement
Advertisement