సాహో సేఫ్‌ స్కెచ్‌!? | Sakshi
Sakshi News home page

సాహో సేఫ్‌ స్కెచ్‌!?

Published Tue, Oct 24 2017 12:06 AM

First look of Prabhas in 'Saaho' released!  - Sakshi

ఇట్స్‌ క్లియర్‌... ఏదో జరిగింది. కానీ, ఏం జరిగింది? అందరికీ తెలియాలంటే ఇంకా చాలా రోజులు వెయిట్‌ చేయాలి! బట్, సాహో టైమ్‌ మాత్రం స్టార్ట్‌ అయిందనేది క్లియర్‌!! మంచు దుప్పటి కప్పిన మహా నగరంలో ఓ చోటుకి ఉదయమే ఉరుకులు పరుగులు పెడుతూ వస్తారు పోలీసులు. అక్కడ ఏమైందోనని పెద్ద ఎత్తున జనాలూ అటువైపు పరుగులు తీస్తారు. ఒక్కడు మాత్రం అక్కణ్ణుంచి ఆపోజిట్‌ డైరెక్షన్‌లో వెళ్తాడు.

ముఖానికి ముసుగు... చేతిలో సెల్లు... పోలీసుల పరుగులకు కారణం అతడేనా? సేఫ్‌ స్కెచ్‌తో అక్కణ్ణుంచి అతను ఎస్కేప్‌ అయ్యాడా? సోమవారం ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సాహో’ యూనిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ చూస్తే ఎన్నో ప్రశ్నలు! ప్రతి క్వశ్చన్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది.

ఏమాటకామాటే... లుక్‌ ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో ఉందంటున్నారంతా! ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ‘సాహో’లో బీటౌన్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలో దుబాయ్‌లో యాక్షన్‌ సీక్వెన్సులు తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌–ఎహసన్‌–లాయ్, కెమెరా: మధి, కళా దర్శకుడు: సాబు సిరిల్, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌.

Advertisement
Advertisement