నవ్వడం ఖాయం | Sakshi
Sakshi News home page

నవ్వడం ఖాయం

Published Wed, Feb 11 2015 11:02 PM

నవ్వడం ఖాయం

ప్రేక్షకులను నవ్వించడానికి వస్తున్న చిత్రం ‘ఫుల్ గ్యారెంటీ’. ‘నవ్వుకి లవ్వు’ అనేది ఉపశీర్షిక. రామకృష్ణ బొత్స దర్శకత్వంలో ఎల్లమిల్లి శ్రీసూర్యతేజ, కె. సాయిగిరి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం చూసినవారికి నవ్వులు ఫుల్ గ్యారెంటీ’’ అని దర్శక, నిర్మాతలు అన్నారు. జీవా, కారుమంచి రఘు, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చిన్ని చరణ్, ఎడిటింగ్: అనిల్‌కుమార్ జల్లు, సమర్పణ: ఎల్లమిల్లి బాలమురళీకృష్ణ.

Advertisement
 
Advertisement